Wednesday, December 23, 2009

ఎప్పటికీ ప్రజాస్వామ్యయంత్రాంగం సాదించును విజయం?

ఎంతకాలం ఈ దయాదుల నడుమ అసూయల జగడం?
ఎప్పటివరకు శాంతికాముకుల ఆలోచనపై అత్యాచారం?
ఎన్నడు మనకు మనరాష్ట్రములో అలజడి నుండి విముక్తి?
ఎప్పటికీ ప్రజాస్వామ్యయంత్రాంగం సాదించును విజయం?

कब तक यूँही हम आपस मे लड़ते रहेंगे ?
कब तक अमन द्रोही यूँ आक्रमण करेंगे ?
कब तक यूँ हम अपनीही देशमे डरते रहेंगे?
कब तक नेता हम आम जनता से खेलेंगे?

Tuesday, December 22, 2009

మనం(అంటే నేనే) పూరించిన आదర్శ్ ప్రశ్న



కేటుగాడు, నాటుగాడు, బక్కటొడు, సొకురాయుడు... :ప
జహంగీర్ గారు,
పైన చెప్పిన పదాలతొ అర్థవంతంగా జనరంజకంగా ఒక పద్యాన్ని ఆశువుగా వ్రాయాలని కోరుచున్నము :)


నా
ప్రయత్నం:

సాన్నిహిత్యంతో మనచు దోచే కేటుగాడు
జనారణ్యంలోవిహంగంలాంటి నాటుగాడు
ఏనుగంత మనోబలమున్న బక్కటొడు
నవీన పోకడల దివిటీ ఈ సొకురాయుడు

ఈ లంకెలో ఏముందో??

Friday, December 18, 2009

ఎర్ర డ్రస్సు అప్సరస

చాలా కాలం తర్వాత ఉపాయం బాగా ఒత్తుగా రావటం వల్ల ఈ టపా రాయక తప్పటం లేదు, మీరు చదివి భరించండి తప్పదు మరి..

గోవాలో ఒక వెయ్యి నవ్వు ముఖాల ఛాయ చిత్రాలు తియ్యటానికి మా ఫోటోగ్రఫీ ఔత్సాహికుల ముఠా బయలు దేరింది సరే నేను సై అన్నాను ఏదో విధంగా గోవా ముఖం ఒక్కసారైన చూద్దాం అని. సరే అదేదో గోవా టూరిజం వాళ్ళు సమర్పిస్తున్నారంటే ఏంటో అనుకున్న అక్కడ పడుకోటానికి రెండు గదులిచ్చారు అలాగే కొంతమందికి తిక్కట్లు కూడా ఇచ్చారు నాకు మాత్రం పూర్రచెయ్యి సమర్పించారు. ఏది ఏమైనా కింగ్‌ఫిషర్లో టిక్కట్టు కొనుక్కున్నాను కనీసం ఏదో ఒక్కటి గిట్టుబాటు అవుతుందని.

కొంచం బలం టానిక్ తాగి విమానాశ్రయానికి బయలుదేరాను దారిలో యాదవిధిగా ట్రాఫ్ఫిక్ జాం అయ్యింది డబ్బులు వృధా అయ్యిన కోపం మొత్తం ఒబామాకు శాంతి భహుమతి ఇచ్చినవాల్ళ మీద తీర్చుకున్నాను ఎలాగూ చేసేది ఏమీ లేదు కాబట్టి.

దార్‌లో రకరకాల ఫీలింగ్స్.. గోవ ఎలా ఉంటుంది గోవాలో ఏముంటుందో ఎం కనపడుతుందో.. ఒక గొప్ప అనుభూతి...
ఇంతలో రానే ఒచ్చింది రియల్ ఎస్టేట్ కంపనివాళ్ల ప్రకటనల్లో విసిగి చితికి పోయిన హైడెరాబ్యాడ్ ఇంటర్‌న్యాషనల్ ఏర్‌పోర్ట్ నేను దానికి అతి సమీపంలో ఉన్నాను సడన్గా ఎవడైనా స్పాట్ రెజిస్ట్రేషన్ అంటాదేమో అని లోనికి పరుగు లంకించుకున్నాను..

లోపల దూరగానే ఒక చాకు లాంటి కుర్రాడు కింగ్‌ఫిషారా సార్ అన్నాడు, అవును అన్నాను, అతను ఒక ఏ.టి.ఎం లాంటి మిషన్ మీద అక్కడక్కడ నిమిరి బోర్‌డింగ్ పాస్ చటుక్కున తీసి ఇచ్చాడు.
గేట్ దగ్గరకి వెళ్ళి ఎర్రరంగు ఉద్యోగులను చూస్తూకూర్చున్నాను .... ఇంతలో పిలుపు రానే ఒచ్చింది ఎన్నెన్నెన్నొ ఊహలు కళ్ళల్లో మెదిలాయె....
అక్కడ వాయు వంతెన లేదు.. భలే భలే...ఒక ఎర్ర డ్రస్సు అప్సరస ప్రకటన విని బస్సు ఎక్కి కూర్చున్నాను ఆది ఇనుప పక్షి దగ్గరకి తీసుకు వెళ్ళింది.

ఆది ఎంతో కాలంగా ఎదురు చూసిన రోజు ఆ చిన్న ఇనుప పక్షికి మూడో నాలుగో మెట్లు ఉన్నాయి.. అప్పుడు కాలింది నాకు బోయింగ్ డిజైనర్ మీద ఎదురుగా ఒక ఎర్ర డ్రస్సు అప్సరస చక్కని పలువారుస చూపిస్తూ వయ్యారాలు ఓలుక పోస్తు రా రమ్మని పిలుస్తుంటే ఈ ఉచిత అనుభూతి కొన్ని ఘడియాలైన నిలవకుండా...అంత తక్కువ మెట్లు పెట్టినందుకు. వెంటనే కత్తియుధ్ధ కాంతారావు గుర్తొచ్చి కాలు బెణికినట్టు నటన మొదలు పెట్టాను... ఆ అప్సరస ముఖంలో ఆందోళన.. ఏమయ్య్యింది నా ప్రియుడికి...వెంటనే నన్ను సుతిమెత్తగా పట్టుకొని మెట్లు ఎక్కించింది బంగారు ఛాయ... సంతూరో లాక్క్సొ అడిగే మూడ్లో లేను నేను.. అలా ఎంట్రీ ఇచ్చాను విమానంలోకి..

విమానంలో కధ కమామీషూ .. తర్వాత టపా లో....