Monday, January 18, 2010

ఎర్ర డ్రస్సు అప్సరస కధ కమామిషు!!

అప్పుడు నా అప్సులు (ఎర్ర డ్రస్సు అప్సరస) బోర్డింగ్ పాస్‌లో నా సీట్ నంబరు చూసింది....వెంటనే . నేను గంతేసి ఎగిరాను.. .అప్సులు కళ్ళు రెప రెప లాడించింది నేను బోర్డింగ్ పాస్‌లో నంబరు చూసి..వెంటనే నాకు కత్తియుధ్ధ కాంతారావు గుర్తొచ్చి కాలు బెనుకుడు కొనసాగింది. ఆందోళన పడుతున్నారా?? భరించలేకున్నారా నా సీట్ సంఖ్య ఒకటి మేము ఎంట్రీ ఇచ్చింది 60 నంబరు సీట్ దగ్గర..
అంటే... ఓల్డ్ సిటీ లో గల్లి కంటే సన్నగా ఉండే దారిలో నన్ను నా అప్సులు నా సీటు వరకు తీసుకెళ్తుందన్నమాట...

ఆహా కాలం అక్కడ ఒక సంవత్సరం కమర్షియల్ బ్రేక్ తీస్కుంటే దాని సొమ్మేం పోను అనిపించింది..కానీ యాడ్స్ ఖర్చు విపరీతమని అలాగే యాడ్స్ కోసం చానల్ వాళ్ళు గోతికాడ నక్కలా కాచుకు కూర్చున్నారని ఆమధ్య పల్లీలు తిన్న నాలుగు చదరపు ఇంచుల పేపర్లో చదివిన సంగతి గుర్తొచ్చి ఆ కమర్షియల్ బ్రేక్ ఆలోచన మానుకున్నాను.

మాతో రండి...

మేము కలిసి మొదటి అడుగు వేసినప్పుడు మూసినది లో ఒక్కో చేప మా ప్రేమ కలకాలం ఇదే రెంజులో కాణి ఖర్చు లేకుండా సాగాలని ప్రార్ధన చేశాయి..

మా రెండో అడుగుకి గోకుల్ చాట్ లో చమ్చా నాకిన ప్రతి ప్రేమికుడు మా ప్రేమ వెలీడిటీ ఉన్నంత కాలం కుక్కలు వెంటపడకుండా సాగాలని తల్చుకున్నారు. అలా వేసిన ప్రతి అడుగుకు హైద్రాబాద్‌లో ఎవరో ఒక్కరూ వెరైటీగా అనుకున్నారు.. డీటేల్స్ తర్వాత...

స్థితప్రజ్ఞతతో వ్యవహరించుట అసమర్ధతకు చిహ్నం కానే కాదు! జ్ఞానవంతులు అజ్ఞాన దురాశపరుల చేరి చెడుదురా?. ఈ లైన్ కి మన టపాకి దీనికి ఎటువంటి సక్రమ సమబంధం లేదు..

అప్పుడు నాకళ్ల పడ్డాడు ఏకాంబరం గాడు..వాడు చిన్నప్పుడు నా నిమ్మతొనలు దొంగిలించాడు..ఆ విషయంలో వాడితో పగ తీర్చుకుందాం అనుకున్న కానీ పగ కంటే ప్రేమ గొప్పది.. అందుకే వాడిని ఒదిలెసా...అహా ఏమీ త్యాగ నిరతి...

అలా ఒక్కో అడుగు ముందు పడుతుంటే నా సీటు సమీపిస్తుంటే న గుండెలో గుబులు..సహా ప్రయణికులు ముఖ్యంగా పురుషులు శరీరం మొత్తం ఈర్ష్యతో కుమిలి కుమిలి కమిలి బీట్రూట్ ఫ్రై రంగులో మారిపోయ్యారు..

ఈ విషయం బ్లాగులో చదివి ఊసరవెల్లుల సమాఖ్య పేటెంట్ రుసుము కట్టకుండా రంగు మార్చినందుకు 7వ నంబరు రహదారి రోడ్డు మధ్యలో ఏడు పెంకులాట ఆడి తమ నిరసన వ్యక్తం చేసాయి...

(పుర్రే బొమ్మ ...మూడవ నంబరు ప్రమాద హెచ్చరిక...క్రింద వాఖ్యం 18 సంవత్సరాలు నిండని పసి గుడ్లు చదవ రాదు)

అప్పుడు రానే ఒచ్చింది..నా సీటు.. నా అప్సు నన్ను జాగ్రత్తగా కూర్చోబెట్టే సమయంలో ఒక గట్టి ఊపిరి సలపని కౌగిలింత ఇవ్వక తప్పలేదు.. ప్రేమ కదా..

అలా సీటు మీద కూర్చొగానే బండి గాల్లోకి రివ్వున లేచింది..నా మనసు ఆల్‌రెడీ అక్కడే మబ్బుల్లో ఉంది నా శరీరం అక్కడకి చేరూకోగానే ఒక బలమైన క్షణంలో పాట షురూ అయింది.. మబ్బుల్లో చంద్రాయ్య...చంద్రాయ్య...చంద్రాయ్య...
ట్యూన్ గుర్తుంది కదా....?? పుహళెన్ధిలా కాకుండా తెలుగులో పాడండి...

పాట వినండి మళ్లీ టపా లో విధి ఎంత బలీయమైనది... సభ్య సమాజంలో ఎలాంటి పెనుమార్పులు జరిగాయి.. ఆ మీసం అలా ఎందుకు తిరిగింది లాంటి సంబంధం లేని విషయాల గురించి రాస్తా.....


ఏంటి ఫోటో చూస్తారా..పర్లేదు చూడండి.... ఇదిగో...

Saturday, January 2, 2010

అభివృద్ధిపధంపై ఏకాగ్రతతో దశాబ్దారంభం

మార్పుపై ప్రధాన దృష్టితో మొదలైన వర్షం
సృజనాత్మకత పటిష్టతతో మెరుగైంది హర్షం
అభివృద్ధిపధంపై ఏకాగ్రతతో దశాబ్దారంభం
వ్యూహనుసారం మున్ముందుఉంది సంబ్రంబం